గెలిచే వరకు ప్రయత్నిస్తా: ‘సైక్ సిద్ధార్థ’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో నందు

గెలిచే వరకు ప్రయత్నిస్తా: ‘సైక్ సిద్ధార్థ’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో నందు

నందు హీరోగా నటిస్తూ శ్యామ్ సుందర్ రెడ్డితో కలిసి నిర్మించిన చిత్రం ‘సైక్ సిద్ధార్థ’. వరుణ్ రెడ్డి దర్శకుడు. యామిని భాస్కర్ హీరోయిన్‌‌‌‌గా నటించగా,  ప్రియాంక రెబెకా, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా, సురేష్​ ప్రొడక్షన్స్ ద్వారా డిసెంబర్ 12న సినిమా విడుదలవుతోంది. మంగళవారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా నందు మాట్లాడుతూ ‘ఈ సినిమాకు ‘మీలాంటి యువకుడి కథ’ అనే ట్యాగ్‌‌‌‌లైన్ పెట్టాం.  కథ కూడా ఇప్పుడున్న సొసైటీకి రిలేట్ అయ్యేలా, యూత్‌‌‌‌కి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. 

దర్శకులు  రాఘవేంద్రరావు గారు, సాయి రాజేష్ గారు, అనుదీప్  ఈ సినిమా చూసి అభినందించారు.  సురేష్ బాబు గారు రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. నిర్మాతగా నేను టేబుల్ ఫ్రాఫిట్‌‌‌‌లో ఉన్నా. నా కెరీర్‌‌‌‌‌‌‌‌కి ఇది బంగారు బాట లాంటి సినిమా అవుతుంది. ఒకవేళ ఫెయిల్ అయినా గెలిచేవరకు ప్రయత్నిస్తూనే ఉంటా’ అని అన్నాడు.  చాలా గ్యాప్ తర్వాత ఆడియెన్స్ ముందుకొస్తున్నానని యామిని భాస్కర్ చెప్పింది. ఈ చిత్రం అందరినీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్ చేస్తుందని దర్శకుడు వరుణ్ రెడ్డి అన్నాడు.