Dasara Teaser : మందంటే మాకు వ్యసనం కాదు.. సాంప్రదాయం

Dasara Teaser : మందంటే మాకు వ్యసనం కాదు.. సాంప్రదాయం

నేచురల్ స్టార్ నాని హీరోగా కొత్త దర్శకుడు  శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న  లెటేస్ట్ మూవీ ‘దసరా’. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేశ్‌ హీరోయిన్ గా నటిస్తోంది. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. తెలుగు టీజర్‌ను దర్శకుడు రాజమౌళి  విడుదల చేయగా తమిళ్ లో హీరో ధనుష్, హిందీలో షాహిద్ కపూర్, మళయాళంలో దుల్కర్ సల్మాన్, కన్నడలో రక్షిత్ శెట్టి ఏకకాలంలో రిలీజ్ చేశారు. 

సింగరేణి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న దసరా సినిమాలో తెలంగాణ యాస ఉపయోగించారు. అయితే టీజర్ లో నాని డైలాగ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మందంటే మాకు వ్యసనం కాదు.. అలవాటుపడ్డ సంప్రదాయం అంటూ నాని చెప్పిన డైలాగ్ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను అవహేళన చేసేలా ఉందన్న విమర్శలు ఎదురవుతున్నాయి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న దసరా సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చుతున్నారు. ఈ మూవీలో నాని సిల్క్ స్మిత అభిమానిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.