Saripodhaa Sanivaaram: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘సరిపోదా శనివారం’..రన్ టైమ్ విషయంలో రిస్క్ చేస్తున్న నాని..

Saripodhaa Sanivaaram: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘సరిపోదా శనివారం’..రన్ టైమ్ విషయంలో రిస్క్ చేస్తున్న నాని..

నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిపోదా శనివారం’. డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి  నిర్మిస్తున్నారు. ప్రతి శనివారం అప్‌‌డేట్స్‌‌ ఇస్తున్న మేకర్స్. ఈ శనివారం గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 29న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

తాజాగా సరిపోదా శనివారం సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డ్ U/A స‌ర్టీఫికెట్ జారీ చేసింది. అలాగే 2 గంట‌ల 50 నిమిషాలు ర‌న్ టైం లాక్ చేయబడింది. యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రం నుంచి రిలీజైన విజువల్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

అంటే సుందరానికి, సరిపోదా శనివారం..రెండు చిత్రాలకు దర్శకుడు వివేక్‌ ఆత్రేయ కావడం విశేషం. వీరిద్దరి కాంబినేషన్‌లో మరోసారి సినిమా రానున్నడంతో ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంటే సుందరానికి సినిమాతో డిస్సప్పాయింట్ చేసిన వివేక్ ఈ సారి ఎలాగైనా బలంగా హిట్ కొట్టాలని సరిపోదా శనివారం సినిమాని తెరకెక్కించాడు. అయితే, ఒక్కవిషయంలో మాత్రం ఆడియన్స్ లో అలజడి పుట్టింస్తుంది.

ALSO READ | Iman Esmail: ప్రభాస్తో ఛాన్స్ కొట్టేసిన యంగ్ యూట్యూబర్‌..అస‌లెవ‌రీ ఇమాన్ ఇస్మాయిల్ ?

అదేంటంటే..రొమాంటిక్‌ కామెడీగా రూపొందిన ‘అంటే సుందరానికి..’ సినిమా నిడివి గం 2:56 నిముషాలు. కంటెంట్‌ బాగున్నా రన్‌టైమ్‌ విషయంలో ప్రేక్షకులు కాస్త అసంతృప్తి చెందారు. ఇపుడు సరిపోదా శనివారం రన్ టైం 170 నిమిషాల 50 సెకన్లుగా ఉంది. అంటే, సరిపోదా శనివారం​​​​​​​ ఆరు నిమిషాల తేడాతో రానుండడం గమనార్హం. అంటే సుందరానికి అనే సినిమాతో ఎక్కువ రన్ టైమ్ చేసినా, అది పూర్తిగా క్లిక్ అవ్వలేదు. మరి ఇపుడు ఈ సినిమా ఎలా ఉంటుందో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

పోలీస్ ఆఫీస‌ర్‌కు, ఒక కామ‌న్ మ్యాన్‌కు మ‌ధ్య జరిగే పోరాటం నేప‌థ్యంలో యాక్ష‌న్ అంశాల‌తో ఈ మధ్యే రిలీజ్ చేసిన వీడియో గ్లింప్స్‌ ఆక‌ట్టుకుంటోంది. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండటం అదనపు బలం.

'U/A' సర్టిఫికేట్:

ఎవరైనా  దీన్ని చూడవచ్చు.. కాకపోతే 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఈ చిత్రాన్ని వారి తల్లిదండ్రులతో కలిసొ లేదా పెద్దల తోడుతో చూడాలని సూచిస్తారు. ఈ సర్టిఫికేట్ పొందిన సినిమాల్లో హింసాత్మక యాక్షన్ సన్నివేశాలు,  కొంతవరకు నగ్నత్వం ఉంటుంది.