
‘శత్రువులు మనకి ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలని ప్రయత్నించారు. దానికి మన దేశం, సైన్యం చాలా హుందాగా బదులు చెప్పింది’ అన్నాడు హీరో నాని. అతను హీరోగా నటించి, నిర్మించిన ‘హిట్ 3’ సక్సెస్ మీట్‌లో మాట్లాడుతూ ‘తమ కారణంగా ఇండియాలోని ఒకచోట సక్సెస్ సెలబ్రేషన్ క్యాన్సిల్ అయిందనే సంతృప్తిని పాకిస్తాన్ వాళ్లకు ఇవ్వకూడదని ఉద్దేశంతో ఈ సెలబ్రేషన్ చేయడం జరిగింది. మనల్ని ఏమీ చేయలేకపోయారని స్టేట్మెంట్ పాస్ చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది.
లెట్స్ సెలబ్రేట్.. లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ. సైన్యంలో ఉన్న అందరికీ నా, మా టీం తరపునుంచి ఏ బిగ్ సెల్యూట్. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. సక్సెస్ అవుతుందని అనుకున్నాను కానీ ఈ స్థాయిలో సక్సెస్ అవుతుందని ఊహించలేదు. క్రైమ్ థ్రిల్లర్‌ని ఒక బిగ్ మాస్ కమర్షియల్ సినిమాలా సెలెబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. డైరెక్టర్ శైలేష్‌తో వర్క్ చేయడం చాలా ఫన్‌గా ఉంటుంది. తనతో నేను చేయబోయే నెక్స్ట్ సినిమా మాత్రం మంచి కామెడీ ఎంటర్‌టైనర్ అవ్వాలని కోరుకుంటున్నా’ అని అన్నాడు.
ఇందులో తను పోషించిన క్యామియో రోల్‌కి మంచి కాంప్లిమెంట్స్ రావడం హ్యాపీగా ఉందని అడివి శేష్ అన్నాడు. ఇదొక వండర్‌ఫుల్ జర్నీ అని, సినిమాకి ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్‌కి హీరోయిన్ శ్రీనిధి శెట్టి థ్యాంక్స్ చెప్పింది. నాని గారు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని భావిస్తున్నా అని దర్శకుడు శైలేష్ కొలను అన్నాడు. మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు.