హాయ్ డాడీ అంటున్న నాని..సూపర్ కాన్ఫిడెంట్ గా టీమ్

హాయ్ డాడీ అంటున్న నాని..సూపర్ కాన్ఫిడెంట్ గా టీమ్

నేచురల్ స్టార్ నాని(Natural star Nani) మరో కొత్త దర్శకుడితో సినిమా చేయడానికి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.శౌర్యువ్ (Shouryuv) అనే కొత్త దర్శకుడితో రాబోతున్న ఈ మూవీ నాని 30వ సినిమా కావడం విశేషం.ఫ్యామిలీ ఎమోషన్స్ తో రాబోతున్న ఈ మూవీ పై భారీ అంచనాలున్నాయి. షూటింగ్ తుది దశలో ఉన్నఈ మూవీ రష్ చూసిన టీమ్ అంత నాని కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ అవుతుందని సమాచారం.తండ్రి కూతుళ్ళ నేపథ్యంతో వస్తున్న ఈ మూవీ లో నాని ఎమోషన్స్ తారా స్థాయిలో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. 

హాయ్ డాడీ(Hi Dady) అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ మూవీ లో నాని సరసన మృణాల్ ఠాకూర్(Mrunal Takur) హీరోయిన్ గా నటిస్తుండగా శృతి హాసన్(Shruthi hasan) కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది.హేషమ్ అబ్దుల్ వహాబ్(Hesham Abdul Wahab) సంగీతం అందిస్తున్న ఈ మూవీ ని  వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్(Vyra Entertainments) పతాకంపై మోహన్ చెరుకూరి(Mohan Cherukuri), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల(Vijeyender Reddy teegala) మరియు మూర్తి KS(Murti) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. జెర్సీ లో  తండ్రి పాత్రతో అందరి హృదయాల్ని టచ్ చేసిన నాని ఈ సినిమాతో మరో ఆరా క్రీయేట్ చేయబోతున్నట్టు సమాచారం.

కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth odela) తో తీసిన దసరా సినిమాతో మాస్ ప్రేక్షకులని ఆకట్టుకున్న నాని వంద క్లబ్ లోకి చేరి తన సత్తా చాటిన విషయం తెలిసేందే.