The Paradise: నాని ఈసారి ఇంటర్నేషనల్.. హాలీవుడ్ ఏజెన్సీతో శ్రీకాంత్ ఓదెల చర్చలు

The Paradise: నాని ఈసారి ఇంటర్నేషనల్.. హాలీవుడ్ ఏజెన్సీతో శ్రీకాంత్ ఓదెల చర్చలు

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్’.  ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, నాని లుక్స్ సినిమాపై ఆసక్తిని పెంచగా, తాజాగా గ్లోబల్ లెవల్‌‌లో ఈ చిత్రాన్ని తీసుకెళ్తున్నారు మేకర్స్. హాలీవుడ్‌‌లోనూ ఈ మూవీ మార్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తోన్న టీమ్.. ఓ ఫేమస్ హాలీవుడ్ యాక్టర్‌‌తో చర్చలు జరుపుతున్నారు.

హాలీవుడ్ ఇండస్ట్రీలోని  కనెక్ట్మోబాసెన్స్ క్రియేటివ్ కంటెంట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అలెగ్జాండ్రాను కలిసి ప్రమోషన్ల విషయంలో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. ‌‌దీంతో ఈ ప్రాజెక్టుపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి.

హైదరాబాద్, -సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే ఇంటెన్స్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీతో ‘కిల్’ ఫేమ్ రాఘవ జూయాల్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. మార్చి 26న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ,  హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్  సహా  మొత్తం ఎనిమిది భాషల్లో పాన్ వరల్డ్‌‌ మూవీగా  రిలీజ్ చేస్తున్నారు.