దసరా షూటింగ్ పూర్తయింది

దసరా షూటింగ్ పూర్తయింది

నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌‌లో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న చిత్రం ‘దసరా’. రీసెంట్‌‌గా షూటింగ్ పూర్తి చేశారు మేకర్స్. ఈ విషయాన్ని నాని ట్విటర్ ద్వారా తెలియజేస్తూ.. ‘దసరా’ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ డైమండ్  ఎప్పుడూ షైన్‌‌గానే ఉంటుంది’అని ట్వీట్ చేశాడు. బొగ్గు గనుల బ్యాక్‌‌డ్రాప్‌‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సింగరేణి కార్మికుల లుక్‌‌లో సర్‌‌‌‌ప్రైజ్ చేయనున్నారు నాని, కీర్తి సురేష్. ఇప్పటికే రిలీజైన వీళ్లిద్దరి లుక్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలు పోషించిన ‘దసరా’ ప్యాన్ ఇండియా వైడ్‌గా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో  మార్చి 30న  రిలీజ్ కానుంది.