బాబు మనవడి పుట్టినరోజు : రూ.30 లక్షలతో అన్నదానం

బాబు మనవడి పుట్టినరోజు : రూ.30 లక్షలతో అన్నదానం

తిరుమల వెంకన్నను ఇవ్వాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనం తర్వాత తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయానికి చేరుకొని… తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలను స్వీకరించారు. ఆ తర్వాత అన్నప్రసాదం ట్రస్టుకు రూ.30 లక్షల విరాళాన్ని తిరుమల జేఈవో శ్రీనివాసురాజుకి అందచేశారు.

ముఖ్యమంత్రి మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్బంగా కోడలు బ్రాహ్మణి, దేవాన్ష్ తో కలిసి నారా భువనేశ్వరి తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. అన్నప్రసాదానికి ఒక్కరోజు అయ్యే ఖర్చు మొత్తం రూ. 30 లక్షల చెక్కుని అందజేశారు.

అన్నప్రసాద కేంద్రంలో ఒక్కరోజుకు అయ్యే ఖర్చును ప్రతి ఏటా ముఖ్యమంత్రి కుటుంబం విరాళంగా ఇస్తున్నారని జేఈవో తెలిపారు.