దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ అంతర్జాతీయ వేదికపై చర్చకు వచ్చింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైదరాబాద్ ఫాలోఅప్ ఫోరమ్ ఆలోచనకు డబ్ల్యూఈఎఫ్ నుంచి సానుకూల స్పందన లభించింది. ఇదిలా ఉండగా.. దావోస్ వేదికగా ఒక ఇంట్రెస్టింగ్ సీన్ జరిగింది. ఏపీ మంత్రి నారా లోకేష్ సీఎం రేవంత్ ను సన్మానించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
ఈ భేటీలో గౌరవ సూచకంగా సీఎం రేవంత్ రెడ్డిని లోకేశ్ శాలువాతో సన్మానించారు. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల మధ్య పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల అభివృద్ధి, ఉపాధి అవకాశాలు వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.తెలంగాణను మూడు ట్రిలియ న్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే రోడ్ మ్యాప్ ను సీఎం ప్రపంచ నేతల ముందుంచారు. దావోస్లో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జర్గెన్స్, సీ4ఐఆర్ నెట్వర్క్ కోఆర్డినేషన్ హెడ్ మంజు జార్జ్తో సీఎం కీలక సమావేశం నిర్వహించారు.
జనవరిలో దావోస్లో జరిగిన చర్చల అమలును సమీక్షించేందుకు ప్రతి ఏడాది జులైలో హైదరాబాద్లో ఫాలోఅప్ ఫోరం నిర్వహించా లని సీఎం ప్రతిపాదించారు. తెలంగాణలో ఉన్న పారి శ్రామిక అవకాశాలు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ విధానాలు, స్కిల్ డెవెలప్మెంట్ పై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ను ప్రపంచానికి చూపించడమే లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
ఈ ప్రతిపాదనపై డబ్ల్యూఈఎఫ్ బృందం ఆసక్తి వ్యక్తం చేసింది. పలు దేశాల నుంచి ప్రతిపాదనలు ఉన్న ప్పటికీ, సమీప భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటామని జెరెమీ జర్గెన్స్ తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047 విజ స్లోలోని విభిన్న కోణాలు అంతర్జాతీయ భాగస్వామ్యాలకు అనుకూలంగా ఉన్నాయని డబ్ల్యూఈఎఫ్ ప్రశంసించిం ది. తెలంగాణ ఆర్థిక వృద్ధి ప్రయాణంలో భాగస్వామ్యం పంచుకుంటామని స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.
