
టాలీవుడ్ హీరో నారా రోహిత్(Nara Rohith) చాలా గ్యాప్ తరువాత చేస్తున్న మూవీ ప్రతినిధి 2(Prathinidhi 2). ఆయన కెరీర్ లో మంచి విజయం సాధించిన ప్రతినిధి సినిమాకు సీక్వెల్ గా వస్తన్న ఈ సినిమాను ప్రముఖ జర్నలిస్టు మూర్తి(Murthy) తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుత సమకాలిన రాజకీయ వ్యవస్థపై వ్యంగ్యాస్త్రంగా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలే ఉన్నాయి.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్ ఆడియన్స్ ను వీపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. రజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 25న రిలీజ్ చేయాలని ప్రకటించిన విషయం తెలిసిందే. చాలా గ్యాప్ తరువాత పొలిటికల్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నారా రోహిత్ ప్రతినిధి 2 కోసం ఎదురు చూసే ఆడియన్స్ డిస్సపాయింట్ కలిగించే న్యూస్ ను మేకర్స్ తెలిపారు.
మరో రెండ్రోజుల్లో థియేటర్లోకి వస్తోంది అనుకున్న ప్రతినిధి 2 మూవీ పోస్ట్ ఫోన్ అయింది. ఈ మేరకు ఈ సినిమా మేకర్స్ 'ప్రతినిధి2 కొద్ది విరామం తీసుకుంటుంది, కానీ భయపడకండి!..అతి త్వరలో థియేటర్‌లలో అద్భుతమైన కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని ప్రకటించారు. అయితే మేకర్స్ తీసుకున్న ఈ షాకింగ్ విషయాన్నీ ఆడియన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు ఎందుకు రిలీజ్ వాయిదా వేశారనే కారణాన్ని మాత్రం మేకర్స్ వెల్లడించలేదు.
#Prathinidhi2 takes a brief pause, but fear not! ❤️?
— Vanara Entertainments (@VanaraEnts) April 23, 2024
We'll be reporting soon at theatres near you with an exciting new release date.?@IamRohithNara #SireeLella @murthyscribe @SagarMahati @TSAnjaneyulu1 @Nchamidisetty @Kumarraja423 @VanaraEnts #RanaArts pic.twitter.com/iduqYjIbvR
ఈ సినిమాలో హీరో నారా రోహిత్ జర్నలిస్టు పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ లోని డైలాగ్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. 'అభివృద్ధి..అదెక్కడ ఉంటుంది సార్, బయటకు వచ్చి ఓటు వేయండి, లేకుంటే చచ్చిపోండి' అలాగే జనం కోసం బతికితే చచ్చాక కూడా జనంలో బతికే ఉంటాం..'ఒక సీఎం చనిపోయాక రాష్ట్రమంతా హింసాత్మక నిరసనలు జరుగుతాయి. మహాత్మా గాంధీ మరణించిన తర్వాత గుండెపోటుతో ఎంత మంది చనిపోయారు’ అంటూ నారా రోహిత్ ప్రశ్నించే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.