చంద్రబాబు తల్లిదండ్రుల సమాధి వద్ద నివాళి

చంద్రబాబు తల్లిదండ్రుల సమాధి వద్ద నివాళి

టీడీపీ అధినేత చంద్రబాబు తల్లిదండ్రుల సమాధుల దగ్గర సినీనటుడు నారా రోహిత్ నిరసన తెలిపాడు. అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై లేనిపోని నిందలు మోపారని ఆవేదన వ్యక్తం చేశాడు. చంద్రబాబు కుటుంబసభ్యుల ప్రస్తావన తేవడం బాధ కలిగించిందంటూ నిరసన తెలిపాడు. తన పెదనాన్న చంద్రబాబు, పెద్దమ్మ భువనేశ్వరి, సోదరుడు నారాలోకేశ్ క్రమశిక్షణకు మారుపేరని చెప్పాడు నారారోహిత్. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు నందమూరి కుటుంబం ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదన్నాడు

పెద్దమ్మ భువనేశ్వరి సేవా కార్యక్రమాలే పరమావధిగా పనిచేస్తున్నారన్నారు నారా రోహిత్. అలాంటి మహోన్మతమైన వ్యక్తిపై అన్నన్ని నిందలు వేయడానికి వైసీపీ నేతలకు నోరెలా వచ్చిందని మండిపడ్డారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పట్నుంచి ఇప్పటిదాకా నందమూరి కుటుంబంలోని మహిళలు ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదన్నారు. ఏనాడూ అవినీతి ఆరోపణలు రాలేదన్నారు. ముఖ్యమంత్రి సతీమణి హోదాలో కూడా పెద్దమ్మ భువనేశ్వరి ఏనాడూ రాజకీయాల్లో కలుగజేసుకోలేదని గుర్తు చేశారు.