Director Trivikram: త్రివిక్రమ్ తర్వాతి హీరో నారా రోహిత్? టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న కొత్త సినిమా కబురు!

Director Trivikram: త్రివిక్రమ్ తర్వాతి హీరో నారా రోహిత్? టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న కొత్త సినిమా కబురు!

వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ క్రేజీ ఫ్యామిలీ డ్రామా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు 'ఆదర్శ కుటుంబం హౌస్ నం. 47' అనే ఆకర్షణీయమైన టైటిల్‌ను ఖరారు చేయడంతో విశేషంగా ఆకట్టుకుంటుంది. సినీ ప్రముఖుల ప్రశంసలు సైతం అందుకుంది. ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ చిత్రంలో మరో హీరో నారా రోహిత్ భాగం కాబోతున్నారని టాక్. సినిమాలో ఆయన నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తారని.. ఇది కథలో చాలా కీలకమైన క్యారెక్టర్ అని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పాత్ర నచ్చ డంతో నారా వారబ్బాయి వెంటనే ఓకే చేశాడని, త్వరలోనే షూటింగ్లో జాయిన్ కాబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

త్రివిక్రమ్ సంప్రదాయం: డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు తన సినిమాల్లో పెద్ద స్టార్ హీరోలతో పాటు యువ హీరోలకు కూడా కీలక పాత్రలు ఇవ్వడం అలవాటు. గతంలో ‘S/o సత్యమూర్తి’ సినిమాలో శ్రీవిష్ణును, ‘అరవింద సమేత’లో నవీన్ చంద్రను, ‘అల వైకుంఠపురములో’సుశాంత్‌ను, తాజాగా ‘గుంటూరు కారం’లో రాహుల్ రవీంద్రన్‌ను పరిచయం చేసిన విషయం తెలిసిందే.

Also Read : మ్యారేజ్ రూమర్స్‌ వేళ మృణాల్ స్పెషల్ పోస్ట్..

ఇప్పుడూ అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి విక్టరీ వెంకటేష్ నటిస్తున్న చిత్రంలో నారా రోహిత్ లాంటి టాలెంటెడ్ నటుడికి కీలక పాత్ర ఇవ్వనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ కాంబినేషన్ సినిమాకు మరింత బలం చేకూర్చే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.

నారా రోహిత్ సెకండ్ లీడ్ రోల్‌: ఇటీవలే ‘సుందరకాండ’ చిత్రంతో సక్సెస్ అందుకున్న తర్వాత, నారా రోహిత్ తన తదుపరి చిత్రాల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే #AK47 చిత్రం తన కెరీర్‌కు మరింత ఊపు తీసుకురావచ్చని ఆయన భావించినట్లు సమాచారం.

గతంలో రవితేజ నటించిన ‘సారొచ్చారు’ సినిమాలో నారా రోహిత్ సెకండ్ లీడ్ రోల్‌లో కనిపించాడు. అయితే ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. దీంతో అప్పటి అనుభవాల నుంచి నేర్చుకుని, ఈసారి సరైన ప్రాజెక్ట్‌ను ఎంచుకోవాలని నారా రోహిత్ భావిస్తున్నాడని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇప్పటికే ఈ సినిమాకు దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉండటంతో, నారా రోహిత్‌కు బలమైన పాత్రను ఆఫర్ చేసి ఉండవచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. త్రివిక్రమ్ మార్క్ కథనంలో కీలక పాత్ర లభిస్తే, అది నారా రోహిత్ కెరీర్‌కు కీలక టర్నింగ్ పాయింట్ కావచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు

వెంకటేష్, త్రివిక్రమ్ కాంబో.. 

టాలీవుడ్ లో స్పెషల్ క్రేజ్ ఉన్న కాంబినేషన్లలో విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ జోడీ ఒకటి.  గతంలో త్రివిక్రమ్ రచయితగా వెంకీతో కలిసి పనిచేసిన 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' లాంటి సినిమాలు తెలుగు సినీ చరిత్రలో ఎవర్ గ్రీన్ క్లాసిక్స్‌గా నిలిచాయి. వాటిలోని కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. అందుకే ఈ ఇద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ చేయాలని అభిమానులు దశాబ్దాలుగా కోరుకున్నారు. ఆ కోరిక ఇన్నాళ్లకు నెరవేరింది.

ఈ సినిమా కథాంశం కుటుంబ విలువలతో కూడిన భావోద్వేగాలను, ఉత్కంఠభరితమైన యాక్షన్‌ను మేళవిస్తుందని తెలుస్తోంది. షూటింగ్‌ను చకచకా పూర్తి చేసి, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. 

త్రివిక్రమ్ సెంటిమెంట్‌:

ఈ సినిమాతో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి తన 'ఆ' సెంటిమెంట్‌ను కొనసాగించారని చెప్పొచ్చు. గతంలో ఆయన తీసిన 'అతడు', 'అత్తారింటికి దారేది', 'అ ఆ', 'అల వైకుంఠపురములో', 'అరవింద సమేత' వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలన్నీ 'అ' లేదా 'ఆ' అక్షరంతో ప్రారంభమయ్యాయి. ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. ఇప్పుడు వెంకీతో చేస్తున్న చిత్రానికి 'ఆదర్శ కుటుంబం' అని పేరు పెట్టడం కూడా ఆ సెంటిమెంట్ కొనసాగింపుగానే భావిస్తున్నాయి సినీ వర్గాలు.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక, హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ మూవీ వెంకటష్ కు 77వ చిత్రం (Venky 77). ఇందులో వెంకీ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంది. సంగీత దర్శకుడిగా ఇటీవల 'యానిమల్' చిత్రంతో సంచలనం సృష్టించిన హర్షవర్ధన్ రామేశ్వర్ పేరు పరిశీలనలో ఉంది.