Mrunal Thakur: మ్యారేజ్ రూమర్స్‌ వేళ మృణాల్ స్పెషల్ పోస్ట్.. హైదరాబాద్ స్టోరీతో బన్నీ ఫ్యాన్స్కి హింట్ ఇచ్చిందా?

Mrunal Thakur: మ్యారేజ్ రూమర్స్‌ వేళ మృణాల్ స్పెషల్ పోస్ట్.. హైదరాబాద్ స్టోరీతో బన్నీ ఫ్యాన్స్కి హింట్ ఇచ్చిందా?

హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పేరు (Mrunal Thakur).. గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఒకవైపు సినిమాల పరంగా, మరోవైపు రిలేషన్‌షిప్ వార్తలతో ఆమె ఎప్పటికప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె చేసిన ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ మరోసారి నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

లేటెస్ట్‌గా హైదరాబాద్‌లో ఉన్నట్టు తెలియజేస్తూ మృణాల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని షేర్ చేసింది. “New Year, New Script, New Beginning” అంటూ క్యాప్షన్ ఇచ్చి అభిమానులతో ఆ క్షణాన్ని పంచుకుంది. ఈ పోస్ట్ ద్వారా మృణాల్ ఓ కొత్త తెలుగు సినిమా ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనుల్లో పాల్గొంటున్నట్లు సంకేతాలు ఇచ్చిందని అభిమానులు భావిస్తున్నారు.

ALSO READ :  రూమర్స్‌కు చెక్ పెట్టిన 'సౌత్ క్వీన్స్'..

అయితే ఈ సినిమా అల్లు అర్జున్–అట్లీ కాంబినేషన్‌లో రూపొందనున్న భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించినదేనా, లేక పూర్తిగా కొత్త ప్రాజెక్టా అనే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే, అల్లు అర్జున్–అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ సినిమాలో దీపికా పదుకునే కీలక పాత్రలో నటిస్తోంది. ఇదే సినిమాలో మరో ముగ్గురు హీరోయిన్స్ కూడా ఉంటారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆ జాబితాలో జాన్వీ కపూర్‌తో పాటు మృణాల్ ఠాకూర్ పేరు కూడా ప్రచారంలో ఉంది. దీనిపై చిత్ర బృందం నుంచి ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఈ క్రమంలోనే తాజా పోస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఇదిలా ఉండగా, 2026లో ‘దో దీవానే సెహెర్ మే’ మరియు ‘డెకాయిట్’ చిత్రాలతో మృణాల్ బిజీ షెడ్యూల్‌లో కొనసాగనుందని సమాచారం. వరుస సినిమాలతో తన కెరీర్‌ను దూసుకుపోతున్న ఈ స్టార్ హీరోయిన్, రాబోయే రోజుల్లో మరిన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ALSO READ :  ‘జన నాయగన్’ విడుదల తేదీపై విచారణ..

హీరో ధనుష్‌తో మ్యారేజ్ రూమర్స్‌పై క్లారిటీ..

మృణాల్ ఠాకూర్, తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రేమలో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అంతేకాదు, వచ్చే నెల ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

2025 ఆగస్టులో జరిగిన ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ప్రీమియర్ షోలో ధనుష్, మృణాల్ ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకోవడం ఈ రూమర్స్‌కు ఆరంభంగా మారింది. అనంతరం ధనుష్ నటించిన ‘తేరే ఇష్క్ మే’ సినిమా షూటింగ్ ముగింపు పార్టీలో మృణాల్ కనిపించడంతో ఈ వార్తలు మరింత బలపడ్డాయి.

ALSO READ : 'మన శంకర వరప్రసాద్' టికెట్ ధరల పెంపుపై హైకోర్టు సీరియస్..

అయితే ఈ పెళ్లి కథనాలపై మృణాల్ ఠాకూర్ సన్నిహిత వర్గాలు తీవ్రంగా స్పందించాయి. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశాయి. ప్రస్తుతం మృణాల్ తన కెరీర్‌పైనే పూర్తి దృష్టి పెట్టిందని, ఫిబ్రవరిలో ఆమె నటించిన ఒక సినిమా విడుదలకు సిద్ధంగా ఉందని తెలిపాయి. అలాగే మార్చి నెలలో మరో తెలుగు సినిమా షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉండటంతో ఆమె వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉందని పేర్కొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి గురించి ఆలోచించే అవకాశం లేదని, ఇవన్నీ కేవలం నిరాధారమైన ప్రచారమేనని మృణాల్ వర్గాలు కొట్టిపారేశాయి.