
తొమ్మిదేళ్ల క్రితం ‘ప్రతినిధి’ అనే పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ చిత్రంతో ఆకట్టుకున్న నారా రోహిత్ ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ను అనౌన్స్ చేశాడు. కొన్నాళ్లుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన రోహిత్ ఈ మూవీతో కమ్ బ్యాక్ ఇస్తున్నాడు. మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహిస్తున్నాడు. ‘ప్రతినిధి2’ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఆకట్టుకున్నాడు రోహిత్. రెండు వేళ్లను పైకెత్తి చూపిస్తూ.. అతని జుట్టు నుంచి ముఖం వరకు, ప్రతిదీ న్యూస్ పేపర్ కటింగ్స్‌తో డిజైన్ చేయబడిన పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది.
పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం కోసం యూనిక్ స్టోరీ, గ్రిప్పింగ్ స్ర్కీన్‌ప్లేను సిద్ధం చేశారట. ఇది నారా రోహిత్‌కి 19వ చిత్రం. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని మేకర్స్ తెలియజేశారు. కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.