
సీఎం కేసీఆర్ కు తనకు మధ్య ఉన్నది పరస్పర నమ్మకమన్నారు తెలంగాణ గవర్నర్ నరసింహన్. కష్టాల్లో ఉన్నప్పుడు మానవత్వం చూపడం, నమ్మకం నిలబెట్టుకోవడం సీఎం కేసీఆర్ లో తనకు కనిపించాయన్నారు. వీడ్కోలు సమావేశంలో మాట్లాడిన గవర్నర్ .. కేసీఆర్ కు ప్రజల నాడి బాగా తెలుసన్నారు. ప్రతీ పథకం గురించి కేసీఆర్ క్లుప్తంగా వివరించేవారని అన్నారు. గవర్నర్ గా వచ్చిన కొత్తలో అన్ని విధాలా సహకరిస్తానని ఉద్యమ నాయకుడిగా మాట ఇచ్చిన కేసీఆర్.. అన్నట్లుగానే మాట నిలబెట్టుకున్నారని అన్నారు. తన పేరు నరసింహన్ అని అందుకే అప్పుడప్పుడు నరసింహ అవతారమెత్తాల్సి వచ్చిందన్నారు . తెలంగాణలో శాంతి భద్రతల పర్యవేక్షణ చాలా బాగుందన్నారు.