క్లీన్ కామెడీ..నారాయణ అండ్ కో

క్లీన్ కామెడీ..నారాయణ అండ్ కో

సుధాకర్ కోమాకుల హీరోగా రూపొందుతున్న చిత్రం ‘నారాయణ అండ్ కో’. ఆమని, దేవి ప్రసాద్ కీలకపాత్రలు పోషించారు. చిన్నా పాపిశెట్టి దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌‌‌‌, సాంగ్స్‌‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. 

‘ది తిక్కల్ ఫ్యామిలీ’ ట్యాగ్‌‌లైన్‌‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని జూన్ 30న విడుదల చేయనున్నట్టు ఆదివారం అనౌన్స్ చేశారు. ఇదొక ఫుల్‌‌లెంగ్త్ క్లీన్ కామెడీ ఎంటర్‌‌‌‌టైనర్ అని, ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుందన్నాడు సుధాకర్.