
రామచంద్రాపురం, వెలుగు: నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి పర్మిషన్లు లేకుండానే అడ్మిషన్లు తీసుకుంటున్న నారాయణ హైస్కూల్‌ను మంగళవారం విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెలిమెలలో నిర్మాణ దశలో ఉన్న నారాయణ స్కూల్‌కు ఎంఈవో పీపీ రాథోడ్ నోటీసులు అంటించారు. ఆయన మాట్లాడుతూ.. భవన నిర్మాణ దశలోనే కరపత్రాలు, పాఠ్యపుస్తకాలు పంచుతూ అడ్మిషన్లు తీసుకుంటున్నారని, డీఈవో ఆదేశాల మేరకు నారాయణ హైస్కూల్‌ను సీజ్ చేశామన్నారు.
అడ్మిషన్ల కోసం వెళ్తున్న తల్లిదండ్రులు సదరు స్కూల్‌కు పర్మిషన్ ఉందో లేదో అధికారులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. గుర్తింపు లేని స్కూళ్ల లిస్టు విద్యాశాఖ ఆఫీసులో ఉంటుందని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే స్కూళ్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.