అడ్రస్ తెలియక విద్యార్థిని అవస్థలు..ఇన్టైంలో ఎగ్జా్మ్ సెంటర్కు చేర్చిన నారాయణగూడ సీఐ

అడ్రస్ తెలియక విద్యార్థిని అవస్థలు..ఇన్టైంలో ఎగ్జా్మ్ సెంటర్కు చేర్చిన నారాయణగూడ సీఐ
  • మానవత్వం చాటుకున్న నారాయణగూడ సీఐ చంద్రశేఖర్

హైదరాబాద్: ఎగ్జామ్ సెంటర్ అడ్రస్ తెలియక అవస్థలు పడుతున్న  విద్యార్థిని ఎగ్జామ్ టైంకు సెంటర్కు చేర్చి మానవత్వం చాటుకున్నారు నారాయణగూడ సీఐ చంద్ర శేఖర్. నల్లగొండ జిల్లా నార్కట్పల్లికి చెందిన విద్యార్థిని వైష్ణవీ టీఎస్ఆర్జేసీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి హైదరాబాద్కు వచ్చింది. అయితే తాను ఎగ్జామ్ రాయా ల్సిన సెంటర్ అంబర్పేట్లోని పటేల్ నగర్లో గవర్నమెంట్ హైస్కూల్ అయితే..ఆటోడ్రైవర్ తప్పిదంవల్ల నారాయణగూడలోని గురునానక్ హైస్కూల్కు వ చ్చింది. 

అప్పటికి సమయం ఉదయం 9 గంటల 45 నిమిషాలు కావడంతో ఎగ్జామ్ సెంటర్కు ఎలా పోవాలని ఆందోళన చెందుతున్న విద్యార్థిని అటుగా వెళ్తున్న నారాయణగూడ సీఐ చంద్రశేఖర్ గమనించారు. విషయం తెలుసుకున్న సీఐ తన పెట్రోలింగ్ వాహనంలో విద్యార్థినిని  ఎగ్జామ్ సెంటర్కు నిర్ణీత సమయం కంటే రెండు నిమిషాలు ముందే చేర్చారు. ఎగ్జామ్ రాసిన అనంతరం విద్యార్థిని వైష్ణవి సీఐ చంద్రశేఖర్కు ఫోన్చేసి కృతజ్ణతలు తెలిపింది.