స్టూడెంట్‌ను టైమ్‌కు ఎగ్జామ్ సెంటర్‌కు చేర్చిన సీఐ

స్టూడెంట్‌ను టైమ్‌కు ఎగ్జామ్ సెంటర్‌కు చేర్చిన సీఐ

బషీర్ బాగ్, వెలుగు : ఎగ్జామ్ సెంటర్ అడ్రస్ తెలియని ఓ విద్యార్థిని ఇన్​టైంలో చేర్చి నారాయణగూడ సీఐ సాయం చేశారు. నల్లగొండ జిల్లా నార్కట్ పల్లికు చెందిన విద్యార్థిని వైష్ణవి తన అమ్మమ్మతో కలిసి ఆదివారం టీఎస్ఆర్జేసీ ఎంట్రెస్ టెస్ట్  రాసేందుకు సిటీకి వచ్చింది. తను ఎగ్జామ్ రాయాల్సిన సెంటర్ అంబర్ పేట్ పటేల్ నగర్ లోని గవర్నమెంట్ బాయ్స్ హైస్కూల్ అయితే, ఆటో డ్రైవర్ తప్పిదంతో నారాయణగూడలోని గురునానక్ హైస్కూల్ కు తీసుకెళ్లాడు. 

అప్పటికే ఉదయం 9 . 45 నిమిషాలు అయింది. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేందుకు ఇంకా 15 నిమిషాలు మిగిలి ఉంది. దీంతో ఎగ్జామ్ సెంటర్ కు ఎలా పోవాలని విద్యార్థిని ఆందోళన చెందుతుండగా.. అటుగా పెట్రోలింగ్ వెహికల్ లో వెళ్తున్న నారాయణగూడ సీఐ చంద్రశేఖర్ చూశారు. తన వాహనంలో విద్యార్థిని ఎగ్జామ్ సెంటర్ కు రెండు నిమిషాల ముందు చేర్చారు. ఎగ్జామ్ రాసిన అనంతరం విద్యార్థిని సీఐకు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపింది.