- మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశం
నారాయణపేట, వెలుగు : ఆగస్టు 15 నాటికి నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నారాయణపేటలోని ఐడీఓసీ పనులను కలెక్టర్ సీహెచ్ ప్రియాంకతో కలిసి పరిశీలించారు. మీటింగ్ హాల్, మంత్రి ఛాంబర్, కలెక్టర్ పై పలు సూచనలు చేశారు. కలెక్టరేట్ భవన ప్రాంగణంలోనే హెలిపాడ్ ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా ఎస్పీ కార్యాలయ నిర్మాణానికి కేటాయించిన ఏడు ఎకరాల ప్రభుత్వ స్థలం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఎస్సీ ఎస్టీ కేసులపై అవగాహన కల్పించాలి
నారాయణ పేట జిల్లాలో ఎస్సీ ఎస్టీ కేసుల గురించి విసృతంగా అవగాహన కల్పించాలని మంత్రి వాకిటి శ్రీహరి అధికారులకు సూచించారు. కలెక్టరేట్ లో షెడ్యూల్ కులాలు తెగల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ ప్రియాంక అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కులం అనే విద్వేషాన్ని రూపుమాపాలన్నారు. ఎస్సీ ఎస్టీ కేసుల్లో బాధితులకు పెండింగ్ లో ఉన్న నష్ట పరిహారం బడ్జెట్ ను ఆ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తో మాట్లాడి మంజూరు చేయిస్తాననిహామీనిచ్చారు.
