రష్యా టూర్ లో బిజీగా ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ద్వైపాక్షిక బంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం జపాన్ ప్రధాని షింజో అబెతో సమావేశమయ్యారు మోడీ.
ఇరు దేశాల మధ్య సంబంధాలపై చర్చలు జరిపారు. ఇరు దేశాల అధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. మలేషియా ప్రధానమంత్రి మహతిర్ మొహమ్మద్ తోనూ సమావేశమయ్యారు ప్రధాని మోడీ. వివిధ దేశాల నేతలతో ప్రధాని సమావేశం సంతృప్తికరంగా సాగిందని విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే చెప్పారు.
Russia: Prime Minister Narendra Modi meets Prime Minister of Japan, Shinzō Abe in Vladivostok. pic.twitter.com/vxnEt5yXqB
— ANI (@ANI) September 5, 2019
