
హైదరాబాద్: రానున్న 25ఏళ్లలో వ్యవసాయ రంగంలో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. ఇక్రిశాట్ స్వర్ణోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. సంస్థ సరికొత్త సంకల్పంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న సమయంలో ఇక్రిశాట్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్న ఇక్రిశాట్కు అభినందనలు తెలిపిన తోమర్.. సరికొత్త వంగడాల సృష్టికి మరిన్ని పరిశోధనలు చేయాలని సైంటిస్టులను కోరారు. జై జవాన్, జై కిసాన్ నినాదానికి వాజ్పేయి జై విజ్ఞాన్ను, ప్రధాని నరేంద్రమోడీ జై అనుసంధాన్లను జోడించారని చెప్పారు. ప్రస్తుతం ప్రజల ఆహారంలో ప్రధానంగా మారిన చిరుధాన్యాల దిగుబడి పెంచే దిశగా పరిశోధనలు విస్తృతం చేయాలని తోమర్ పిలుపునిచ్చారు.
This year India is celebrating 'Azadi Ka Amrit Mahotsav' & ICRISAT is also completing 50 years. Both the occasion gives us inspiration &opportunity to make resolutions for next 25 years: Union Agriculture Min Narendra S Tomar at 50th Anniversary celebrations of ICRISAT, Hyderabad pic.twitter.com/Sn8DNrRBF3
— ANI (@ANI) February 5, 2022