నరేష్ అలా మాట్లాడటం సరైంది కాదు: రాజశేఖర్

నరేష్ అలా మాట్లాడటం సరైంది కాదు: రాజశేఖర్

మా’ కొత్త అధ్యక్షుడిగా నరేశ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన  ప్రతి విషయంలో నేను, నేను అని  వ్యాఖ్యానిస్తూ వచ్చారు. నరేశ్‌ మాట్లాడిన తీరుపై సినీనటుడు, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజశేఖర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. నరేశ్‌ మాట్లాడిన ప్రతి మాటలో ‘నేను’ అనే పదం ఉందని.. ఎక్కడా ‘మేము’ అని ఆయన చెప్పలేదంటూ రాజశేఖర్‌ అభ్యంతరం తెలిపారు.  అంతేకాదు ఆయన నా ఫ్రెండే, కానీ ఏదైనా తప్పు చేస్తే ఇలానే మాట్లాడతా. అది నా నైజం. మేమంతా కలిసే ఉన్నాం, కలిసి పని చేస్తాం. ‘మా’లో ఎవరూ ఏమీ చేయడం లేదు నా వంతుగా ఏదో ఒకటి చేయాలని వచ్చాను. మొదట జీవితను మాత్రమే కంటెస్ట్ చేయిద్దామనుకున్నాను. పదవి లేకుండా నేను ఇక్కడ ఏమైనా మంచి చేయడానికి అవకావం ఉండదు కాబట్టే పోటీ చేశాను అని… రాజశేఖర్ చెప్పుకొచ్చారు.

రాజశేఖర్ మాట్లాడిన వెంటనే మైక్ అందుకున్న జీవిత… అతడి మాటలను కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఈ ఫంక్షన్ ఆర్గనైజ్ చేసే క్రమంలో నరేశ్ ఏదో మరిచిపోయి అలా మాట్లాడారు…. మా మధ్య ఎలాంటి విబేధాలు ఏమీ లేవన్నారు.