
బాలీవుడ్ హీరోయిన్ నర్గిస్ ఫక్రి(Nargis Fakhri) త్వరలోనే ఓటీటీలోకి రానుంది. రాక్‌స్టార్ వంటి సినిమాల్లో నటించినా ఈ బ్యూటీకి పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో ‘తత్లుబాజ్’ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ వేదిక తన ట్యాలెంట్‌కి సరిగ్గా సరిపోతుందని తెలిపింది.
ఇక ఓటీటీల్లో చూపుతున్న అశ్లీలత గురించి మాట్లాడుతూ.. ప్రేక్షకుడికి తనకు నచ్చిన కంటెంట్‌ను ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. దీనిని సమస్యగా భావించాల్సిన అవసరం లేదంది. ఇక తానైతే ఒక్క నగ్నంగా నటించడం తప్ప ఎలాంటి గ్లామర్ పాత్రలకైనా ఓకే అని చెప్పింది.
‘లెస్బియన్, హోమోసెక్సువల్ వంటి పాత్రల్లో నటించడానికి నేను సిద్దమే. కానీ, కథ ఎలాంటిదైనా నగ్నంగా నటించాల్సి వస్తే నో చెప్పేస్తాను’అని నర్గిస్ తెలిపింది. ఇప్పుడు బాలీవుడ్లో ఈ అమ్మడి స్టేట్మెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.