నారీ శక్తి నాకుస్ఫూర్తినిచ్చింది.. ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్​

నారీ శక్తి నాకుస్ఫూర్తినిచ్చింది.. ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్​

న్యూఢిల్లీ: ఇండియాను అభివృద్ధి మార్గంలో నడిపించేందుకు, వికసిత్ భారత్ కోసం నిరంతరం కృషి చేసేందుకు నారీ శక్తి నాకు స్ఫూర్తినిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఒడిశాకు చెందిన బీజేపీ నేత ఒకరు చేసిన ట్వీట్ ను మోదీ రీట్వీట్ చేశారు. ‘‘ఒడిశాలోని సుందర్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌ జిల్లాలో పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా గిరిజన మహిళ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేసేందుకు రూ.100 తీసుకోవాలని నన్ను పట్టుబట్టింది.

డబ్బులు ఏమీ అవసరంలేదని చెప్పినా ఆమె వినిపించుకోలేదు. నా మాటలను ఆ గిరిజన మహిళ అసలు పట్టించుకోలేదు. డబ్బులు తీసుకోవాల్సిందే అని పట్టుబట్టింది. ఇది ఒడిశా, ఇండియా పరివర్తనకు ప్రతిబింబం’’ అని బీజేపీ నేత బైజయంత్‌‌‌‌ జే పాండా తన ట్వీట్ లో పేర్కొన్నారు. దీనిపై మోదీ స్పందిస్తూ ‘‘ఈ ఆప్యాయత నన్ను కదిలించింది. 

ఎల్లప్పుడూ నాపై ఆశీస్సులు కురిపించే మహిళలకు తలవంచి నమస్కరిస్తున్నా. వికసిత్‌‌‌‌ భారత్‌‌‌‌ కోసం కృషిచేసేందుకు వారి ఆశీస్సులే నాకు స్ఫూర్తి” అని పేర్కొన్నారు.