హైదరాబాద్ ఓపెన్‌‌ టెన్నిస్ టోర్నమెంట్‌: నర్సింహా రెడ్డికి టైటిల్

హైదరాబాద్ ఓపెన్‌‌ టెన్నిస్ టోర్నమెంట్‌: నర్సింహా రెడ్డికి  టైటిల్

హైదరాబాద్‌‌, వెలుగు :  హైదరాబాద్ ఓపెన్‌‌ టెన్నిస్ టోర్నమెంట్‌‌17వ ఎడిషన్‌‌ (టాన్లా కప్‌‌)లో నంద్యాల నర్సింహా రెడ్డి 50+ సింగిల్స్‌‌ ఈవెంట్‌‌లో విజేతగా నిలవగా, సీవీ ఆనంద్‌‌–అరుణ్‌‌ కుమార్‌‌‌‌ జోడీ మెన్స్ 40+ డబుల్స్‌‌లో టైటిల్ నెగ్గింది. లేక్‌‌వ్యూ అకాడమీలో సోమవారం ముగిసిన ఈ టోర్నీలో 50+  ఈవెంట్ ఫైనల్లో నర్సింహారెడ్డి–10–9తో మణికందన్‌‌ను ఓడించి టైటిల్ సాధించగా,  డబుల్స్‌‌లో అజయ్‌‌ –రాహుల్‌‌ జంట 10–5తో మూర్తి–మనీశ్‌‌ జంటపై నెగ్గింది. 40+ డబుల్స్‌‌లో ఫైనల్లో ఆనంద్‌‌–అరుణ్ జోడీ 10–7తో శ్రీనివాస్‌‌–రాజా జంటను ఓడించగా, సింగిల్స్‌‌లో అరుణ్‌‌ 10–4తో ఆనంద్‌‌పై గెలిచాడు.

30+ సింగిల్స్‌‌లో సూర్య పవన్‌‌, డబుల్స్‌‌లో మంజునాథ్‌‌–సురేశ్‌‌...  60+ సింగిల్స్‌‌లో రామ్ రెడ్డి, డబుల్స్‌‌లో ఆనంద్‌‌ స్వరూప్‌‌–శ్రీనివాస్‌‌ విజేతలుగా నిలిచారు.ఈ టోర్నీలో దేశవ్యాప్తంగా 300 పైచిలుకు మంది ప్లేయర్లు పాల్గొన్నారని  హైదరాబాద్ ఓపెన్‌‌ టెన్నిస్ అసోయేషన్‌‌ (హోటా) ప్రెసిడెంట్‌‌ నంద్యాల నర్సింహారెడ్డి చెప్పారు. ప్రధాన స్పాన్సర్‌‌‌‌ టాన్లా ఉదయ్ రెడ్డి, ఇతర స్పాన్సర్లకు కృతజ్ఞతలు  తెలిపారు.