
హైదరాబాద్ నార్సింగిలో డ్రగ్స్ కలకలం రేగింది.గురువారం ( అక్టోబర్ 9 ) ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన తెలంగాణ ఈగల్ టీం భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహించిన తెలంగాణ ఈగల్ టీం మంచిరేవుల దగ్గర కొకైన్ సరఫరా చేస్తుండగా ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గర నుంచి రూ. 7 లక్షల 50 వేలు విలువచేసే 107.4 గ్రాముల కొకైన్ సీజ్ చేసినట్లు తెలిపారు.
నిందితులు ముంబై నుంచి హైదరాబాద్ కు సరఫరా చేస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. నిందితులు ముంబైకి చెందిన కార్తికేయ డ్రగ్స్ కొనుగోలు చేసి దందా చేస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ కు బానిసైన ఆనంద్ కుమార్.. డ్రగ్స్ వాడడంతో పాటు, హైదరాబాద్ లోని స్నేహితులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.
డ్రగ్స్ సరఫరా చేయడంలో ఆనంద్ కుమార్ కు మరో నిందితుడు వీరబాబు సహాయం చేసినట్లు తెలిపారు పోలీసులు. నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.