Moons Farside : మనం ఎప్పుడూ చూడని చంద్రుని చిత్రాలు ఇవిగో.. నాసా రిలీజ్ చేసింది

Moons Farside : మనం ఎప్పుడూ చూడని చంద్రుని చిత్రాలు ఇవిగో.. నాసా రిలీజ్ చేసింది

అమెరికా స్పేస్ ఏజెన్సీ NASA మునుపెన్నడూ చూడని చంద్రుని ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. చంద్రునిలో డార్క్ సైడ్ అని పిలువబడే మనకు కనిపంచని భాగానికి సంబంధించిన చిత్రాలు అవి. భూమి వైపు నుంచి చూడగలిగే చంద్రుని భాగం కంటే డార్క్ సైడ్ ..ఎక్కువ క్రేటర్స్, తక్కువ చీకటి మైదానాలను  కలిగిఉంటుంది. 

భూమి నుంచి మనకు కనిపించని చంద్రుని మరో భాగం.. చాలా క్రేటర్, మారియా అని పిలువబడే తక్కువ చీకటి ఉన్న మైదానాలను కలిగి ఉంటుంది. ప్రారంభంలో ఈ చీకటి ప్రాంతాలను మహాసముద్రాలుగా భావించారు. అయితే అవి వాస్తవానికి అగ్ని పర్వత విస్ఫోటనాల వల్ల ఏర్పడిన బసాల్టిక్ మైదానాలు. మరియా అనే పదం సముద్రాలు అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. 

నాసా విడుదల చేసి ఫొటో గురించి డిటెయిల్డ్ గా .. 

NASa విడుదల చేసిన ఈ చిత్రాన్ని లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ (LRO) ద్వారా సంగ్రహించబడింది. ఇది అన్ని పరిమాణాల క్రేటర్లతో కప్పబడిన చంద్రుని గుండ్రని , బూడిద రంగు డిస్క్ వలె కనబడుతుంది. ఎల్లప్పుడు చంద్రుని ఒకవైపు భాగం మాత్రమే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇది టైడల్ గా లాక్ చేయబడింది. అంటే చంద్రుని కక్ష్య కాలం దాని భ్రమణ కాలంతో సమానంగా ఉంటుంది కాబట్టి చంద్రుని ఒక భ్రమణం పూర్తి చేయడానికి భూమిపై ఒక నెల మొత్తం పడుతుంది. ఒకే కక్ష్యలో ఉన్న రెండు ఖగోళాల మధ్య టైడల్ లాకింగ్ జరుగుతుంది.