తక్కువ ధరకే సూపర్ 5G ఫోన్ కావాలా? అయితే Redmi Note 15 5G చూసేయండి! ఈరోజే మొదటి సేల్!

తక్కువ ధరకే సూపర్ 5G ఫోన్ కావాలా?  అయితే Redmi Note 15 5G చూసేయండి! ఈరోజే మొదటి సేల్!

షావోమీ నుంచి లాంచ్ అయినా లేటెస్ట్  Redmi Note 15 5G ఫోన్ సేల్స్ ఈరోజు నుంచి ఇండియాలో ప్రారంభమయ్యాయి. తక్కువ ధరలో మంచి 5G ఫోన్ కావాలనుకునే వారి కోసం దీనిని తీసుకొచ్చారు. ఆన్‌లైన్‌తో పాటు మీ దగ్గరలోని మొబైల్ షాపుల్లో కూడా  ఈ స్మార్ట్  ఫోన్ దొరుకుతుంది.

డిస్కౌంట్ ఆఫర్లు:
మీ దగ్గర SBI, ICICI లేదా Axis బ్యాంక్ కార్డులు ఉంటే, రూ. 3 వేల  వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఆఫర్ తరువాత ఈ ఫోన్ ధర కేవలం రూ. 19,999కే వస్తుంది. కావాలనుకుంటే ప్రతినెలా EMI పద్ధతిలో రూ. 3,333 కట్టి కూడా ఫోన్ తీసుకోవచ్చు. పాత ఫోన్ ఇస్తే ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంది. ఈ ఫోన్ అమెజాన్, షావోమీ వెబ్‌సైట్, మొబైల్ షాపుల్లో దొరుకుతుంది.  ఇంకా నలుపు, నీలం,  పర్పుల్ రంగుల్లో లభిస్తుంది.

ఫీచర్స్ ఏమిటంటే :
ఈ ఫోన్లో సినిమా చూసినా, గేమ్స్ ఆడినా క్లారిటీగా ఉండటం కోసం పెద్ద 6.77 అంగుళాల AMOLED స్క్రీన్‌ ఇచ్చారు. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. వెనుక వైపు 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఈ కెమెరా చాలా క్వాలిటీ ఫోటోలను తీస్తుంది. సెల్ఫీల కోసం 20 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. 

►ALSO READ | మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు లేఆఫ్స్ గండం.. జనవరిలో 22 వేల మందిని తీసేస్తున్నారా..? ఇది నిజమేనా..?

 ఇందులో 5,520mAh పెద్ద బ్యాటరీ ఉంది. ఫోన్ త్వరగా ఛార్జ్ అవ్వడానికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 OSతో పనిచేస్తుంది. రాబోయే 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్లు ఇస్తామని కంపెనీ చెప్పింది. ఇతర ఫీచర్లతో చూస్తే  నీళ్లు, దుమ్ము పడినా పాడవకుండా IP65 రేటింగ్ పొందింది. స్క్రీన్ పైన  ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు.

ధర ఎంతంటే  :
ఈ ఫోన్ రెండు వేరియంట్లో  లభిస్తుంది. ఒకటి 8GB RAM + 128GB స్టోరేజ్ దీని అసలు ధర రూ. 22,999. మరొకటి 8GB RAM + 256GB స్టోరేజ్ దీని అసలు ధర రూ. 24,999.