మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు లేఆఫ్స్ గండం.. జనవరిలో 22 వేల మందిని తీసేస్తున్నారా..? ఇది నిజమేనా..?

మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు లేఆఫ్స్ గండం.. జనవరిలో 22 వేల మందిని తీసేస్తున్నారా..? ఇది నిజమేనా..?

మైక్రోసాఫ్ట్ సంస్థ 2026, జనవరిలో 22 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపిచేస్తు్ందని జోరుగా జరిగిన ప్రచారంపై ఈ అమెరికా మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ స్పందించింది. ఈ ప్రచారాన్ని సదరు MNC కంపెనీ ఖండించింది. ఈ పుకార్లలో నిజం లేదని మైక్రోసాఫ్ట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్పష్టం చేశారు. 

జనవరిలో మైక్రోసాఫ్ట్ కంపెనీ 11 వేల నుంచి 22 వేల మంది ఉద్యోగులను తొలగించనుందని TipRanks రిపోర్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ లేఆఫ్స్ కారణంగా.. Azure Cloud Services, Xbox, Global Sales విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు లేఆఫ్స్ గండం పొంచి ఉందని TipRanks నివేదికలో వెల్లడించింది. ఈ రిపోర్ట్ను మైక్రోసాఫ్ట్ సంస్థ ఖండించింది.

ఐటీ రంగాన్ని కుదిపేస్తున్న సైలెంట్ లేఆఫ్స్కు ముఖ్య కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అని​నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఐటీ రంగంలో ఏఐ వినియోగం పెరిగింది. మనుషులు చేయాల్సిన పనులు మొత్తం ఏఐ టూల్స్ చేస్తున్నాయి. దీంతో కంపెనీలు తమ ప్రొడక్షన్ ​కాస్ట్​ను తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఉద్యోగులను తొలగిస్తే జీతాల భారం తగ్గుతుందని భావిస్తున్నాయి. ఈ క్రమంలో.. బెంచ్పై ఉన్న ఉద్యోగులతో బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నాయి.

ఐటీ కంపెనీల్లో ఏఐ కారణంగానే చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని, రానున్న రోజుల్లో ఏఐ వాడకం మరింత పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఐటీ రంగంలో నిలదొక్కుకోవాలంటే లేటెస్ట్  టెక్నాలజీని ఎప్పటికప్పుడు నేర్చుకోవాలని, స్కిల్స్ పెంచుకోవాలని సూచిస్తున్నారు. ఏఐ, రోబోటిక్స్, మెషీన్ ​లర్నింగ్, డేటా అనలిటిక్స్ ​వంటి కోర్సులు నేర్చుకున్నోళ్లకు ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉండే చాన్స్​ ఉందని చెప్పారు.