ఐఎస్‌‌ఎస్‌‌కు రోబో హోటల్..అటాచ్‌‌ చేసిన నాసా

ఐఎస్‌‌ఎస్‌‌కు రోబో హోటల్..అటాచ్‌‌ చేసిన నాసా

ఇంటర్నేషనల్‌‌ స్పేస్‌‌ స్టేషన్‌‌ (ఐఎస్‌‌ఎస్‌‌) గురించి వినే ఉంటారుగా? దాంట్లో కేవలం ఆరుగురికే చోటుంటుంది. వాళ్లతో పాటు చాలా రోబోలు ఉంటాయక్కడ. వాళ్లతో ఉండవనుకోండి. వేరే సెపరేట్‌‌ ప్లేస్‌‌లో ఉంటాయి. వాటికోసమే నాసా తాజాగా ఓ రోబో హోటల్‌‌ను ఐఎస్‌‌ఎస్‌‌కు అటాచ్‌‌ చేసింది. బుధవారమే స్పేస్‌‌ ఎక్స్‌‌ కమర్షియల్‌‌ రీ సప్లై మిషన్‌‌ ద్వారా దాన్ని పంపింది. హోటల్‌‌ అంటే మనం చూస్తున్న హోటళ్లు కాదు. అత్యవసర రోబోటిక్‌‌ టూల్స్‌‌ను స్టోర్‌‌ చేసుకోవడానికి ఆ రోబో  హోటల్‌‌ను డిజైన్‌‌ చేశారు. దానికి రోబోటిక్‌‌ టూల్‌‌ స్టోవేజ్‌‌ (ఆర్‌‌ఐటీఎస్‌‌)అని పేరు పెట్టారు. ఇందులో రోబోటిక్‌‌ ఎక్స్‌‌టర్నల్‌‌ లీక్‌‌ లొకేటర్ల (ఆర్‌‌ఈఎల్‌‌ఎల్‌‌)ను ఏర్పాటు చేశారు. పేరులో ఉన్నట్టే ఏమన్నా రోబోలకు సంబంధించి లీకేజీలేమైనా ఉంటే పసిగడతాయి. పరికరాలకు సరైన వేడి కూడా ఆర్‌‌ఐటీఎస్‌‌ ద్వారా అందుతుంది. రేడియేషన్‌‌ నుంచి, చిన్న చిన్న తోకచుక్కల నుంచి కూడా రక్షిస్తాయి. ఆర్‌‌ఈఎల్‌‌ఎల్‌‌ నుంచి వచ్చే టెంపరేచర్‌ వల్ల రోబోలు, పరికరాలు సరైన విధంగా పని చేయగలుగుతాయని నాసా చెప్పింది. అయితే స్టేషన్‌‌లోకి రోబోలను నాసా అస్సలు పంపించదు. ఎందుకంటే అవొస్తే ఇతర సైంటిఫిక్‌‌ పరికరాల స్పేస్‌‌ను ఆక్రమిస్తాయి. వాటిని స్టేషన్‌‌లోకి పంపడం కూడా కాస్త కష్టమైన పని. లీక్‌‌ను పసిగట్టే లొకేటర్ల వల్ల ఆస్ట్రోనాట్లకు చాలా వరకు పని సులువవుతుందని నాసా చెప్పింది.