సింగరేణికి జాతీయ అవార్డు

సింగరేణికి  జాతీయ అవార్డు
  • పురస్కారాన్ని స్వీకరించిన సీఎండీ ఎన్. బలరామ్


హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ 5.0 కార్యక్రమంలో సింగరేణి జాతీయస్థాయి ఉత్తమ సంస్థగా ఎంపికైంది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సింగరేణి దేశంలోని అన్ని కంపెనీలను, ఇతర గనుల సంస్థలను మించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. 

గురువారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి  కిషన్ రెడ్డి చేతులమీదుగా సింగరేణి సీఎండీ   ఎన్. బలరామ్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో బొగ్గు శాఖ కార్యదర్శి విక్రమ్ దేవ్ దత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సీఎండీ బలరామ్ మాట్లాడారు. సింగరేణి సంస్థ బొగ్గు, విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎనర్జీ ఉత్పత్తిలో మాత్రమే కాకుండా పరిశుభ్రత, పచ్చదనంలో కూడా దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని పేర్కొన్నారు.