భగవంత్  కేసరి నుంచి రాంపాల్ రాయల్ ఎంట్రీ

భగవంత్  కేసరి నుంచి రాంపాల్ రాయల్ ఎంట్రీ

నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ అర్జున్ రాంపాల్.. ‘భగవంత్  కేసరి’ చిత్రంతో టాలీవుడ్‌‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అర్జున్ విలన్‌‌గా కనిపించనున్నాడు. శనివారం తన పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్‌‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో రాహుల్ సంఘ్వీగా అర్జున్ రాంపాల్ కనిపించనున్నట్టు రివీల్ చేశారు.

అలాగే  పోస్టర్‌‌‌‌లో టెర్రిఫిక్ లుక్‌‌లో ఉన్నాడు.  తన ఇంటెన్స్ లుక్స్‌‌తో,  సింహాసనంపై కూర్చున్నట్టుగా ఉన్న ఫస్ట్‌‌లుక్ క్యూరియాసిటీని పెంచేలా ఉంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌‌గా నటించిన ఈ చిత్రంలో శ్రీలీల కీలక పాత్ర పోషించింది. షైన్ స్ర్కీన్స్ బ్యానర్‌‌‌‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 19న సినిమా విడుదల  కానుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.