‘పూరిసేతుపతి’ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ఇతనే: నేషనల్ అవార్డుతో గుర్తింపు.. ఎవరీ టాలెంటెడ్ హర్ష వర్ధన్..?

‘పూరిసేతుపతి’ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ఇతనే: నేషనల్ అవార్డుతో గుర్తింపు.. ఎవరీ టాలెంటెడ్ హర్ష వర్ధన్..?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోపై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో విజయ్ మూడు డిఫరెంట్ షేడ్స్‌‌‌‌‌‌‌‌లో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. సంయుక్త మీనన్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తున్న ఈ మూవీలో సీనియర్ స్టార్ యాక్టర్స్ టబు, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదంతా ఇప్పటివరకు తెలిసిన ముచ్చట. ఇపుడు ఒక కొత్త అప్డేట్తో, సినిమాపై ఒక్కసారిగా హైప్ పెంచారు డైరెక్టర్ పూరి జగన్నాధ్. 

లేటెస్ట్గా పూరి-సేతుపతి సినిమాకు పనిచేసే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది అనౌన్స్ చేశారు మేకర్స్. ఇవాళ (అక్టోబర్ 9న) పూరి కనెక్ట్స్ X వేదికగా ఫోటో షేర్ చేస్తూ క్రేజీ అప్డేట్ అందించారు. ఈ సినిమాకు క్రేజీ టాలెంటెడ్, నేషనల్‌ అవార్డు విన్నర్‌ 'హర్షవర్ధన్‌ రామేశ్వర్‌' సంగీతం అందించనున్నట్లు పూరి వెల్లడించారు.

ఇపుడు ఈ తాజా  అప్డేట్ పూరి అభిమానుల్లో కొత్త ఒరవడి క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ తొలిసారి పూరితో కలిసి పనిచేయనున్నారు. ప్రస్తుతం స్పిరిట్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు హర్షవర్ధన్. పూరి జగన్నాథ్, చార్మి, జేబీ నారాయణ రావు కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

ALSO READ : బిగ్ బాస్ హౌస్‌లో ముదిరిన లవ్ ట్రాక్స్..

ఎవరీ హర్ష వర్ధన్:

హర్షవర్ధన్.. పూర్తి పేరు హర్షవర్ధన్ రామేశ్వర్ (Harshavardhan Rameshwar). ఈ మధ్య టాలీవుడ్లో ఈ పేరు బాగా వినిపిస్తోంది. తెలుగులో ఇప్పటివరకు చాలా సినిమాలకు మ్యూజిక్ అందించారు ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. మరీ ముఖ్యంగా బ్యాక్ గ్రౌంగ్ స్కోర్ అందించడంలో మనోడు చాలా ఫేమస్. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన సాక్షం (Sakshyam), రవితేజ రావణాసుర (Ravanasura), నిఖిల్ హీరోగా వచ్చిన కేశవ (Keshava) వంటి చాలా సినిమాలకు అంద్భుతమైన సంగీతాన్ని అందించారు హర్షవర్ధన్. 

ఇక ఆయన బ్యాక్ గ్రౌంగ్ స్కోర్ అందించిన సినిమాల్లో చెప్పుకోదగ్గ సినిమా అంటే అర్జున్ రెడ్డి (Arjun reddy) అని చెప్పాలి. ఆ సినిమాలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఎంట్రీ కి ఇచ్చిన బీజీఎం ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఆ మ్యూజిక్ ట్రేండింగ్లో ఉండటం మనం చూస్తూనే ఉంటాం. ఈ సినిమా సక్సెస్లో హర్షవర్ధన్ పాత్ర చాల ఎక్కువ. ఆ కారణంగానే దర్శకుడు సందీప్ రెడ్డి వంగ యానిమల్లో ఛాన్స్ ఇచ్చి మరింత ముందుకొచ్చేలా చేశాడు. ఈ సినిమాతో ఫిల్మ్ ఫేర్, మిర్చి అవార్డు, నేషనల్ అవార్డు వంటి ఆల్ టైం అవార్డ్స్ అన్నీ సొంతం చేసుకున్నారు హర్ష వర్ధన్. ఈ సూపర్ హిట్ సక్సెస్తో ప్రభాస్తో స్పిరిట్ (Spirit) సినిమాకి కూడా హర్షవర్ధన్ పనిచేస్తున్నారు. 

నిజానికి హర్షవర్షన్ తన పేరుతో ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. తన అద్భుతమైన టాలెంట్తో ఇప్పటికే చాలా మంది మనసులు గెలుచుకున్నారు. హర్షవర్ధన్ వర్క్ గురించి తెలిసిన చాలా మంది, తమ అభిమాన హీరోల సినిమాలకు పనిచేస్తే చూడాలని సోషల్ మీడియాలో తరుచూ కామెంట్స్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే పూరిసేతుపతి సినిమాకి పనిచేస్తుండటం.. ఆసక్తి కలిగిస్తుంది.