700 తగ్గిన బంగారం ధర..వెండి ధర వెయ్యి డౌన్

700 తగ్గిన బంగారం ధర..వెండి ధర వెయ్యి డౌన్
  • 50 పైసలు పెరిగిన రూపాయి

న్యూఢిల్లీ: రూపాయి బలపడటం, అంతర్జాతీయ మార్కెట్లో బలహీన సంకేతాల కారణంగా సోమవారం జాతీయ  రాజధానిలో 10 గ్రాముల  బంగారం ధర రూ. 700 తగ్గి రూ. 1,25,400కి చేరింది. 

వరుసగా మూడో  రోజు తగ్గుతూ, 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం రూ. 1,24,800కు పడిపోయింది. వెండి కూడా కిలోకు రూ. 1,000 తగ్గి రూ. 1.55 లక్షలకు చేరింది. రూపాయి విలువ డాలర్‌‌‌‌ మారకంలో  50 పైసలు పెరిగి 89.16 వద్ద స్థిరపడింది.