మన్సూర్ అలీ ఖాన్‌పై జాతీయ మహిళా కమిషన్ చర్యలు

మన్సూర్ అలీ ఖాన్‌పై జాతీయ మహిళా కమిషన్ చర్యలు

తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ ఇటీవల హీరోయిన్ త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన వ్యాఖ్యలపై వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా దీనిపై  జాతీయ మహిళా కమిషన్ స్పందించింది.  మన్సూర్ అలీ ఖాన్‌పై ఐపీసీ సెక్షన్ 509 బి, ఇతర సంబంధిత చట్టాలను ఉపయోగించి కేసు నమోదు చేయాలని తమిళనాడు డీజీపీని ఆదేశించింది.  మహిళలపై  అటువంటి వ్యాఖ్యలను ఖండించాలని జాతీయ మహిళా కమిషన్ పేర్కొంది.

ఇంతకీ ఏం జరిగింది అంటే ? 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మన్సూర్ అలీఖాన్..  లియో సినిమాలో హీరోయిన్  త్రిషతో ఓ సీన్‌ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నో చిత్రాల్లో నేను రేప్‌ సీన్లలో నటించా. లియోలో ఆఫర్‌ వచ్చినప్పుడు త్రిషతోనూ అలాంటి సీన్‌ ఉంటుందని అనుకున్నా. కాకపోతే, అలాంటి సీన్‌ లేకపోవడం బాధగా అనిపించింది అని మన్సూర్‌ అలీఖాన్‌ అన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

త్రిష రియాక్షన్  

అటు  మన్సూర్ అలీఖాన్ కామెంట్స్ పై హీరోయిన్ త్రిష కూడా రియాక్ట్ అయింది. మన్సూర్ అలీ ఖాన్ నా గురించి అసహ్యంగా మాట్లాడిన వీడియో నా దృష్టికి వచ్చింది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అలాంటి వ్యక్తితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోనందుకు సంతోషంగా ఉంది. నా ఫిల్మ్‌కెరీర్‌లో ఇలాంటి వారితో నటించకుండా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటా. ఇలాంటి వారి వల్లే మానవాళికి చెడ్డపేరు వస్తోంది అంటూ ట్వీట్ చేసింది.