కులాంతర వివాహాలపై నవంబర్ 9న సదస్సు

కులాంతర వివాహాలపై నవంబర్ 9న సదస్సు

బషీర్​బాగ్, వెలుగు: కులాంతర వివాహాలకు రక్షణ చట్టం తీసుకురావాలని ఈ నెల 9న బాగ్ లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఛాయాన్, కులనిర్మూలన సంఘం, మానవ -వికాస వేదిక, కులాంతర వివాహితుల సంక్షేమ సంఘం, జన విజ్ఞాన వేధిక, మూడనమ్మకాల నిర్మూలన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ప్రతినిధులు తెలిపారు. హైదర్​గూడలోని ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సదస్సు పోస్టర్ ను ఆవిష్కరించారు. 

సదస్సుకు ముఖ్యఅతిథులుగా మంత్రి సీతక్క, గౌరవ అతిథిగా జస్టిస్ రజని, రాధారాణి, జస్టిస్ చంద్రయ్య, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, విమలక్క తదితర ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో 2 వందలకు పైగా కులాంతర వివాహాలు చేసుకున్న జంటలు హాజరుకానున్నట్లు తెలిపారు.