లోక్ సభ ఎన్నికల్లో ఓటమి.. పలు రాష్ట్రాలకు కాంగ్రెస్ కమిటీలు

లోక్ సభ ఎన్నికల్లో ఓటమి.. పలు రాష్ట్రాలకు కాంగ్రెస్ కమిటీలు

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో  పార్టీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాని రాష్ట్రాలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు పలు రాష్ట్రాలకు కమిటీలు వేసింది. రాష్ట్రాల్లో పార్టీ వైఫల్యాలకు గల కారణాలు తెలుసుకునేందుకు నిజనిర్ధారణ కమిటీలు వేసింది. మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, కర్ణాటక, తెలంగాణ, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ,ఉత్తరాఖండ్ లకు కమిటీలు ఏర్పాటు చేసింది. 

కొన్ని రాష్ట్రాల్లో పార్టీ అధికారంలో ఉన్నా ఆశించిన సీట్లు రాలేదు. మరికొన్ని రాష్ట్రాల్లో పార్టీ ఘోరంగా ఓటమి పాలయ్యింది.  మధ్యప్రదేశ్ , ఢిల్లీ,ఉత్తరాఖండ్ లో మొత్తం  బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా 28 సీట్లకు కేవలం 9 సీట్లే గెలిచింది. చత్తీస్ ఘడ్ లో బీజేపీ 10 సీట్లు గెలుచుకోగా..కాంగ్రెస్ ఒక సీటు గెలిచింది.   తెలంగాణలోనూ  17 ఎంపీ సీట్లకు గానూ 8 సీట్లు మాత్రమే  గెలిచింది. ఈ క్రమంలోఆయా రాష్ట్రాల్లో అసలు సీట్లు తగ్గడానికి కారణాలేంటి?..పార్టీ పేలవమైన పనితీరుకు గల కారణాలను ఈ కమిటీలు తెలుసుకోనున్నాయి. 

మధ్యప్రదేశ్

 పృథ్వీరాజ్ చవాన్
 సప్తగిరి ఉలక
జిగ్నేష్ మేవానీ

ఛత్తీస్‌గఢ్

 వీరప్ప మొయిలీ
 హరీష్ చౌదరి

ఒడిశా

 అజయ్ మాకెన్
 తారిక్ అన్వర్

ఢిల్లీ/ఉత్తరాఖండ్ , హిమాచల్ ప్రదేశ్ 

పి.ఎల్. పునియా
 రజనీ పాటిల్

కర్ణాటక

 మధుసూదన్ మిస్త్రీ
 గౌరవ్ గొగోయ్
 హిబీ ఈడెన్

తెలంగాణ

 P.J. కురియన్ 
 రకీబుల్ హుస్సేన్
 పర్గత్ సింగ్