బిటెక్ అర్హతతో NIT వరంగల్లో ఉద్యోగాలు.. వెంటనే అప్లయ్ చేసుకోండి...

బిటెక్ అర్హతతో NIT వరంగల్లో ఉద్యోగాలు.. వెంటనే అప్లయ్ చేసుకోండి...

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ (ఎన్ఐటీ వరంగల్) రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి  నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు. 

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి 85 శాతం కంటే ఎక్కువ మార్కులతో ఈసీఈలో బి.టెక్ లేదా కనీసం 60 శాతం మార్కులతో బి.టెక్ తోపాటు ఫస్ట్ క్లాసులో ఈసీఈ, సిగ్నల్ ప్రాసెసింగ్, ఎంబెడెడ్ సిస్టమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషలైజేషన్​లో ఎం.టెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 30 సంవత్సరాలు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 10. 

లాస్ట్ డేట్: డిసెంబర్ 05. 

సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు nitw.ac.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.