NIT వరంగల్లో ఉద్యోగాలు... డిగ్రీ పాసైన వాళ్ళు అప్లయ్ చేసుకోవచ్చు..

NIT వరంగల్లో ఉద్యోగాలు...  డిగ్రీ పాసైన వాళ్ళు అప్లయ్ చేసుకోవచ్చు..

నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ (NIT, WARANGAL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు.  

పోస్టులు: 03. విజిటింగ్ కన్సల్టెంట్ (లీగల్ అడ్వైజర్) 01, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ‌‌01, స్టూడెంట్ కౌన్సిలర్ 01. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ, బీఏ, బీఎస్సీ, ఎంబీబీఎస్, ఎంఏ, ఎంఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 11.

అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్​డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు రూ.300.  

లాస్ట్ డేట్: డిసెంబర్ 10. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు nitw.ac.in  వెబ్​సైట్​లో సంప్రదించగలరు.