హైదరాబాద్​లో టెర్రరిస్ట్ అరెస్ట్

హైదరాబాద్​లో టెర్రరిస్ట్ అరెస్ట్
  •     రాజేంద్రనగర్​లో అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ
  •     కూలి పని చేస్తూ ‘హిజ్బ్ ఉత్ తహ్రిర్’  టెర్రరిస్ట్ యాక్టివిటీస్
  •     బయో కెమికల్, బ్యాక్టీరియాతో దాడులకు స్కెచ్

హైదరాబాద్‌‌, వెలుగు : ‘హిజ్బ్ ఉత్ తహ్రిర్’ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దర్యాప్తు ముమ్మరం చేసింది. రాజేంద్రనగర్​లో మంగళవారం సోదాలు నిర్వహించి మహ్మద్ సల్మాన్ అనే సభ్యుడిని అరెస్ట్ చేసింది. డిజిటల్ డివైజ్​లు, హార్డ్ డిస్క్, పెన్​డ్రైవ్​లు, ఎస్డీ కార్డులతో పాటు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. భోపాల్ కేంద్రంగా హిజ్బ్ ఉత్ తహ్రిర్ నిర్వహిస్తున్న కార్యకలాపాలను మధ్యప్రదేశ్ ఏటీఎస్ మే నెలలోనే ట్రేస్ చేసింది. తర్వాత హైదరాబాద్​లో మే 10న సోదాలు చేసి ఆరుగురిని అరెస్ట్ చేసింది. మే 24న ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దేశవ్యాప్తంగా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ యాక్టివిటీస్​పై దర్యాప్తు చేస్తున్నది. బయో కెమికల్‌‌, బ్యాక్టీరియాతో విధ్వంసాలు సృష్టించి దేశంలో షరియత్ చట్టాలు అమలు చేసేందుకు కుట్ర చేసినట్లు ఆధారాలు సేకరించింది.

హైదరాబాద్ మాడ్యూల్​లో కీలక సభ్యుడు

మహ్మద్‌‌ సల్మాన్‌‌ మేడ్చల్‌‌ జిల్లా జవహర్‌‌ ‌‌నగర్‌‌లోని శివాజీనగర్‌‌‌‌లో నివాసం ఉండేవాడు. రోజువారీ కూలీగా పని చేస్తుండేవాడు. హైదరాబాద్ మాడ్యూల్‌‌లో మహ్మద్ సల్మాన్‌‌ కీలకంగా వ్యవహరించాడు. డెక్కన్ కాలేజీలో ఫార్మాస్యూటికల్‌‌ బయోటెక్నాలజీ హెచ్​వోడీగా పనిచేసిన మహ్మద్‌‌ సలీం అలియాస్‌‌ సౌరభ్‌‌ రాజ్‌‌ వైద్య, సాఫ్ట్​వేర్ ఇంజినీర్‌‌‌‌ అబ్దుల్ రెహ్మాన్ అలియాస్‌‌ దేవీ ప్రసాద్ పాండ, డెంటల్ డాక్టర్‌‌ షేక్‌‌ జునైద్‌‌తో కలిసి యువకులను రిక్రూట్ ​చేశాడు. ఇండియాలో షరియత్‌‌ చట్టాలు అమలు జరిగేలా చేసేందుకు ‘తంజీమ్‌‌’ పేరుతో హైదరాబాద్ మాడ్యూల్‌‌ ఆపరేషన్స్‌‌ జరిపింది.

సైన్స్, ఐటీ యువతే లక్ష్యంగా రిక్రూట్​మెంట్ 

‘హిజ్బ్‌‌ ఉత్‌‌ తహ్రిర్‌‌‌‌’ హ్యూమన్ బాంబ్స్‌‌, గ్రెనేడ్స్​తో కాకుండా హై టెక్నాలజీ, బ్యాక్టీరియా, బయో కెమికల్స్ తో విధ్వంసాలకు ప్లాన్ చేస్తున్నట్లు ఇన్వెస్టిగే షన్ ఏజెన్సీలు గుర్తించాయి. సైన్స్‌‌, ఐటీలో అనుభవం ఉన్న సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ యు వతను రిక్రూట్‌‌ చేసుకుంటున్నట్లు బయటపడింది. మెడికో, ఐటీ స్టూడెం ట్స్‌‌ను ఆకర్శించేలా మీటింగ్​లు నిర్వ హించినట్లు ఆధారాలు సేకరించారు.