హాలియా, వెలుగు: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని విజయ విహార్‌లో రీసెర్చ్ సొసైటీ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్ ఇన్ ఇండియా (టీజీ ఆర్ఎస్ఎస్డీఐ) 11వ వార్షిక జాతీయ అవగాహన సదస్సు శనివారం ఘనంగా నిర్వహించబడింది. ఈ సదస్సును నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మధుమేహం ప్రస్తుతం ప్రతీ ఇంటిని ప్రభావితం చేస్తూ రైతులు, కూలీలు, యువతలో వేగంగా విస్తరించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
జాతీయ స్థాయి సదస్సు సాగర్‌లో జరగడం గర్వకారణమని, ఇక్కడ వెల్లడయ్యే ఆధునిక చికిత్సా విధానాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు చేరాలని ఆయన ఆకాంక్షించారు. సదస్సులో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, సంస్థ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అనుజ్ మహేశ్వరి, నిర్వాహకులు పాల్గొన్నారు.
