ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో ఆదివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో 11,022 కేసులు పరిష్కరించినట్లు సెషన్స్ కోర్ట్ జడ్జి, లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ యువరాజ్ తెలిపారు. ప్రత్యేక లోక్ అదాలత్‌లో రాజీ పడదగిన క్రిమినల్ కాంపౌండెంట్, సివిల్ కేసులు పరిష్కరించామని చెప్పారు. పరిష్కరించిన కేసులకు రూ. 55,61,865 జరిమానా విధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఆనంత లక్ష్మి,సెకండ్ క్లాస్ సెషన్స్ జ్యూడీషియల్ జడ్జి అమృత్ పాల్ కౌర్ తదిత రులు పాల్గొన్నారు.
లోక్‌అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలి
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: అప్పీలు లేని అంతిమ తీర్పు లోక్ అదాలత్లతోనే సాధ్యమని, కక్షిదారులు సద్వినియోగం చేసుకొని కేసులను పరిష్కరించుకోవాలని ఆదిలాబాద్జిల్లా కోర్టు న్యాయమూర్తి ప్రభాకర్ రావు అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన లోక్ అదాలత్‌లో కొన్నేండ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించారు. 4656 సివిల్, 17 క్రిమినల్‌కేసులను పరిష్కరించి బాధితులకు పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేశ్, న్యాయవాదులు పాల్గొన్నారు.
రాజీమార్గమే రాజమార్గం
లక్సెట్టిపేట, వెలుగు: కక్షిదారుల మధ్య నెలకొన్న వివాదాలు పరిష్కారానికి రాజీమార్గమే రాజమార్గమని లక్సెట్టిపేట జూనియర్ సివిల్ జడ్జి సాయికిరణ్ అన్నారు. లక్సెట్టిపేట కోర్టు ఆవరణలో స్పెషల్ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న చిన్న కేసుల్లో ఇరుక్కొని కోర్టు చుట్టూ తిరగకుండా లోక్ అదాలత్‌లను వినియోగించుకోవాలని కక్షిదారులకు సూచన చేశారు. భూతగాదాలు, చెక్ బౌన్స్, క్రిమినల్, 498 కేసులు రాజీకీ వస్తే పరిష్కరించి కేసులను కొట్టివేస్తామన్నారు. లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం, మండలాల ఎస్సైలు సురేశ్, తహసీనోద్దిన్, అనూష, పోలీసు సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు.
