డిసెంబర్ 21న జాతీయ లోక్ అదాలత్

డిసెంబర్ 21న జాతీయ లోక్ అదాలత్

హైదరాబాద్ సిటీ, వెలుగు: వివాదాలు, కేసులను త్వరగా పరిష్కరించుకోవడానికి ఈ నెల 21వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో లోక్ అదాలత్ జరగనున్నది. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ కోరింది. లోక్ అదాలత్‌‌లో సివిల్ కేసులు, వివాహ సంబంధిత వివాదాలు, మోటారు ప్రమాద క్లెయిమ్‌‌లు, చెక్ బౌన్స్ కేసులు, రాజీ పడే అవకాశం ఉన్న క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇందు కోసం కక్షిదారులు సంబంధిత కోర్టులు లేదా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని సంప్రదించాలని సూచించారు. 

ఈ నెల13 న దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో లోక్ అదాలత్‌‌లు నిర్వహిస్తున్నారని, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ కారణంగా లోక్ అదాలత్‌‌ను ఈ నెల 21 కి రీషెడ్యూల్ చేశారన్నారు. కాగా..21న జరగనున్న లోక్ అదాలత్‌‌లో ట్రాఫిక్ చలాన్ల సెటిల్మెంట్ కోసం ఎటువంటి టోకెన్లు ఇవ్వడం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ లోక్ అదాలత్‌‌లో ట్రాఫిక్ చలాన్ల పరిష్కారం లేదని పేర్కొన్నారు.