జాతీయ మాస్టర్‌‌‌‌‌‌‌‌ అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌ షురూ

జాతీయ మాస్టర్‌‌‌‌‌‌‌‌ అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌ షురూ

హైద‌‌‌‌‌‌‌‌రాబాద్‌‌‌‌‌‌‌‌: సుమారు 20 ఏండ్ల త‌‌‌‌‌‌‌‌ర్వాత హైద‌‌‌‌‌‌‌‌రాబాద్‌‌‌‌‌‌‌‌లో జ‌‌‌‌‌‌‌‌రుగుతున్న జాతీయ మాస్టర్‌‌‌‌‌‌‌‌ అథ్లెటిక్స్ ప్రారంభోత్సవ వేడుక‌‌‌‌‌‌‌‌లు అంగ‌‌‌‌‌‌‌‌రంగ వైభ‌‌‌‌‌‌‌‌వంగా జ‌‌‌‌‌‌‌‌రిగాయి. 30 ఏళ్ల నుంచి 70 ఏళ్లు పైబ‌‌‌‌‌‌‌‌డిన వెట‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌న్ అథ్లెట్లు యువ‌‌‌‌‌‌‌‌త‌‌‌‌‌‌‌‌లా మారి క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొన‌‌‌‌‌‌‌‌డంతో గ‌‌‌‌‌‌‌‌చ్చి బౌలి క్రీడా ప్రాంగ‌‌‌‌‌‌‌‌ణం కళ‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌ళ్లాడింది. గురువారం గ‌‌‌‌‌‌‌‌చ్చిబౌలి స్టేడియంలో జ‌‌‌‌‌‌‌‌రిగిన ఈ ఆరంభ వేడుక‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌కు మాజీ కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మ‌‌‌‌‌‌‌‌ల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌‌‌‌‌‌‌‌రై, పోటీలు ప్రారంభించారు.  

ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌, పంజాబ్‌‌‌‌‌‌‌‌, ఢిల్లీ, గుజ‌‌‌‌‌‌‌‌రాత్‌‌‌‌‌‌‌‌, కేర‌‌‌‌‌‌‌‌ళ వంటి సుదూర ప్రాంతాల నుంచి 70, 80 ఏళ్లు పైబ‌‌‌‌‌‌‌‌డిన వారు కూడా ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొనేందుకు హైద‌‌‌‌‌‌‌‌రాబాద్ రావ‌‌‌‌‌‌‌‌డం గొప్ప విష‌‌‌‌‌‌‌‌య‌‌‌‌‌‌‌‌మన్నారు. వెట‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌న్ అథ్లెట్లను యువ‌‌‌‌‌‌‌‌త ప్రేర‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌గా తీసుకోవాల‌‌‌‌‌‌‌‌ని సూచించారు. ఈ కార్యక్రమంలో జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ వ‌‌‌‌‌‌‌‌ర్కింగ్ ప్రెసిడెంట్ మ‌‌‌‌‌‌‌‌ర్రి ల‌‌‌‌‌‌‌‌క్ష్మణ్ రెడ్డి, రాష్ట్ర మాస్టర్ అథ్లెటిక్స్ కోశాధి కారి డి.ల‌‌‌‌‌‌‌‌క్ష్మి, ప్రధాన‌‌‌‌‌‌‌‌ కార్యద‌‌‌‌‌‌‌‌ర్శి ప్రభుకుమార్‌‌‌‌‌‌‌‌, సంయుక్త కార్యద‌‌‌‌‌‌‌‌ర్శి ల‌‌‌‌‌‌‌‌క్ష్మణ్‌‌‌‌‌‌‌‌రావు త‌‌‌‌‌‌‌‌దిత‌‌‌‌‌‌‌‌రులు పాల్గొన్నారు.