డిసెంబర్ 15 వరకు నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ లకు గడువు పెంపు

డిసెంబర్ 15 వరకు నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ లకు గడువు పెంపు

హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియెట్ పాసైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందించే ‘నేషనల్ మెరిట్ స్కాలర్‌‌షిప్’ దరఖాస్తు గడువును పెంచారు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫ్రెష్ అప్లికేషన్లతో పాటు, రెన్యువల్స్ కోసం డిసెంబర్ 15వ తేదీ వరకు గడువును పొడిగించినట్టు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి మార్చి 2025లో ఇంటర్ పాసైన మెరిట్ స్టూడెంట్స్ అర్హులని, https://scholarships.gov.in వెబ్‌‌సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని సూచించారు. స్టూడెంట్స్ అప్లికేషన్లను కాలేజీలు/ఇన్‌‌స్టిట్యూట్‌‌లు వెరిఫై చేయడానికి డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చారు. 

61 వేల మంది సెలెక్ట్..

ఇంటర్ ఫలితాలు–2025 ఆధారంగా ప్రొవిజనల్‌‌గా సెలెక్ట్ అయిన అభ్యర్థుల లిస్టును బోర్డు అధికారిక వెబ్‌‌సైట్ tgbie.cgg.gov.in లో అందుబాటులో ఉంచారు. ఓవరాల్‌‌గా 61,135 మంది విద్యార్థులు ఈసారి నేషనల్ మెరిట్ స్కాలర్‌‌షిప్​కు అర్హత సాధించారు. జనరల్ కేటగిరీలో 18,696 మంది, ఓబీసీ కేటగిరీలో 33,932 మంది, ఎస్సీ లు 8,446 మంది, ఎస్టీలు 5,361 మంది, దివ్యాంగులు 43 మంది ఉన్నారు. ఈ విద్యార్థులంతా గడువులోగా అప్లై చేసుకోవాలని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య సూచించారు.