హైదరాబాద్ లో.. పేపర్ ట్రేడర్ల జాతీయ సదస్సు

హైదరాబాద్ లో.. పేపర్ ట్రేడర్ల జాతీయ సదస్సు

హైదరాబాద్​, వెలుగు:  ఫెడరేషన్ ఆఫ్ పేపర్ ట్రేడర్స్ అసోసియేషన్స్ (ఎఫ్‌‌‌‌‌‌‌‌పీటీఏ), తెలంగాణ పేపర్ మర్చంట్స్ అసోసియేషన్ (టీపీఎంఏ) ఆధ్వర్యంలో హైదరాబాద్​లో శనివారం మొదలైన సదస్సును,  ఎఫ్‌‌‌‌‌‌‌‌పీటీఏ  వార్షిక సర్వసభ్య సమావేశాన్ని గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ఈనెల ఐదో తేదీ వరకు జరిగే ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 1,000 మందికి పైగా వ్యాపారులు హాజరవుతున్నారు. 

టీపీఎంఏ మాజీ అధ్యక్షుడు కిషన్ సింగ్ ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీటీఏ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. దేశంలో ఏటా 2.4 కోట్ల టన్నుల కాగితం ఉత్పత్తి అవుతోంది. పర్యావరణహిత కాగితంపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని, నోట్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌లపై జీరో జీఎస్టీ అమలు చేయాలని సంఘాలు కోరాయి. సరుకు నిల్వ చేయడానికి అందుబాటులో ధరల్లో గిడ్డంగుల స్థలాలు కేటాయించాలని, ఎంఎస్‌‌‌‌‌‌‌‌ఎంఈ వ్యాపారులకు సులభంగా వర్కింగ్ క్యాపిటల్ రుణాలు అందించాలని విజ్ఞప్తి చేశాయి.