జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవం: వెలుగు ఫొటోగ్రాఫర్ కు ప్రైజ్

జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవం: వెలుగు ఫొటోగ్రాఫర్ కు ప్రైజ్

సిద్దిపేట, వెలుగు: జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్​ ప్రెస్ క్లబ్  నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో కన్సొలేషన్  ప్రైజ్ కు ఎంపికైన  సిద్దిపేట జిల్లా వీ6 వెలుగు ఫొటో జర్నలిస్ట్  మహిమల భాస్కర్ రెడ్డికి శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బహుమతి అందజేశారు. శనివారం హైదరాబాద్​ ఐఏఎస్  ఆఫీసర్స్  అసోసియేషన్  క్లబ్​లో జరిగిన కార్యక్రమంలో ప్రెస్  అకాడమీ చైర్మన్  శ్రీనివాసరెడ్డి, ఆల్  ఇండియా ప్రెస్ క్లబ్  ప్రతినిధులతో కలిసి ప్రైజ్ ను అందజేసి అభినందించారు. భాస్కర్ రెడ్డిని సిద్దిపేట జిల్లా జర్నలిస్టులు, ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, ప్రముఖులు అభినందించారు.