హైదరాబాద్, వెలుగు: నేషనల్ స్పోర్ట్స్ ఎరోబిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ టీమ్ ఓవరాల్ విన్నర్‌గా నిలిచింది. తమిళనాడులోని సేలం వేదికగా జరిగిన ఈ టోర్నీలో తెలంగాణ734 పాయింట్లతో టాప్ ప్లేస్ సొంతం చేసుకుంది. తమిళనాడు 640 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచింది.
ఆద్య , సోనాక్షి గౌడ్, అనఘ, ధాత్రి రెడ్డి, అక్షయ్ సింగ్ తదితరులు తమ ఏజ్ కేటగిరీల్లో గోల్డ్ మెడల్స్ గెలుపొందారు. ఏఐఎస్ఏఎఫ్ఏ జనరల్ సెక్రటరీ ఎం.జి. దత్తాత్రేయ, తెలంగాణ స్పోర్ట్స్ ఏరోబిక్స్ ఫిట్‌నెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజ సింగ్ విన్నర్లను అభినందించారు.
