రేపే నేషనల్ స్పోర్ట్స్‌ అవార్డ్‌ సెర్మనీ.. మిస్సవనున్న రోహిత్

రేపే నేషనల్ స్పోర్ట్స్‌ అవార్డ్‌ సెర్మనీ.. మిస్సవనున్న రోహిత్

న్యూఢిల్లీ: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రతిష్టాత్మక ఖేత్ రత్న అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ పురస్కార వేడుక శనివారం జరగనుంది. అయితే రోహిత్‌తోపాటు అర్జున అవార్డు నెగ్గిన స్పీడ్‌స్టర్ ఇషాంత్ శర్మ యూఏఈలో ఉన్నారు. త్వరలో ఐపీఎల్ జరగనున్న నేపథ్యంలో ఈ ఇద్దరు క్రికెటర్స్ యూఏఈకి వెళ్లారు. ఈ నేపథ్యంలో నేషనల్ స్పోర్ట్స్ అవార్డు వేడుకను రోహిత్, ఇషాంత్ మిస్సవనున్నారు. వీళ్లిద్దరూ తర్వాత ట్రోఫీలను అందుకోనున్నారు. దేశంలోని తొమ్మిది లొకేషన్స్‌లోని వివిధ స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్రాల్లో అవార్డీలకు పతకాలు అందజేయనున్నారు. ప్రెసిడెంట్ రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్ నుంచి వర్చువల్‌గా పాల్గొననున్నారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చండీగఢ్, బెంగళూరు, పూణే, సోనేపట్, హైదరాబాద్, భోపాల్‌ సాయ్ సెంటర్స్‌లో ఈ వర్చువల్ ఈవెంట్ జరగనుంది. అయితే ఈ సెంటర్స్‌కు వెళ్లాల్సిన అవార్డీల్లో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో సదరు ముగ్గురు ప్లేయర్ల కూడా కార్యక్రమానికి దూరంగా ఉండనున్నారు.